17 June, 2026 | 11:35 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

09-02-2026 04:47 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందరు విద్యార్థులు అందంగా ముస్తాబయి తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు విశేషంగా కృషి చేసి సఫలీకృతులయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల మాట్లాడుతూ... సమాజంలో గౌరవాన్ని పెంపొందించేది కేవలం విద్య మాత్రమేనన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ స్వపరిపాలన దినోత్సవం లో జిల్లా పరిపాలనాధికారిగా గండవరం సంకీర్తన, ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా జుని ప్రీతికౌర్, డీఇఓగా షేక్ యాస్మిన్, జెడ్పీ సిఇఓ గా కొత్తపల్లి అశ్విత్, ఎంఇఓ గా జెల్లా ఐశ్వర్య, ఎమ్మార్వోగా సత్తి ధాన్యకౌర్, ప్రధానోపాధ్యాయులుగా రుద్రవరం భవాని, ఉపాధ్యాయులుగా మల్లె అమృత, గాదె శివాని, బందారం లిఖ్విత్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.సుశీల, ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఎ.పద్మజ, కోణం శ్రీనివాస్, జి.ఇందిర, ఎ.కవిత, ఎన్.సైదులు, సిహెచ్.ప్రసన్న, జి.శైలజ, జె.మంజుల, సిహెచ్.శంకరయ్య, ఎండి.సాదిక్, ఎం.జానకి, ఎం.సౌమ్య, ఎన్.సరళ, డి.కుసుమ, జి.శ్రీనివాస్, పి.తిరుమల, బి.నవీన్, ఎం.హైమావతి పాల్గొన్నారు.