27 April, 2026 | 12:37 PM

ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

02-07-2025 12:00 AM

కూకట్‌పల్లి, జూలై 1 (విజయక్రాంతి): మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన ప్రకారం ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుంచి రూ. 80 వేలను సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ.30 వేలను తీసుకుంటుండగా సునీతను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.