01-07-2025 11:06:28 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్.ఎం.పి వైద్యుడు వనం మధుకర్ ను డాక్టర్స్ డే(National Doctors Day)ను పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. వాసవి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ... మధుకర్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యం పట్ల సలహాలు సూచనలు చేస్తూ ఉంటాడని పేర్కొన్నారు. లాభా పేక్ష లేకుండా ప్రజలకు వైద్యం అందిస్తున్న మధు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాత శ్రీనివాస్, కృష్ణమూర్తి, పిన్న వివేక్, సుగుణాక ర్, వెంకన్న తదితరులున్నారు.