calender_icon.png 16 September, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మిక మృతి

14-09-2024 10:16:16 AM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఎంఎస్ఆర్ అనుచరుడు అయిన సమ్మిరెడ్డి పిసిసి మీడియా సెల్ ఇంచార్జి గా సేవలు అందించారు. సమ్మిరెడ్డి మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

సమ్మిరెడ్డి ఎన్ఎస్ యుఐ విద్యార్థి నాయకుడి నుంచి సుదీర్ఘకాలం పనిచేస్తూ కాంగ్రెస్లో అంచలంచెలుగా ఎదిగారని ఆయన మృతి పార్టీకి, నాయకులకు కార్యకర్తలకు తీరని లోటు అని చెప్పారు. సమ్మిరెడ్డి మృతి పట్ల వెలిచాల రాజేందర్ రావు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబమనోధైర్యం కల్పించాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నట్లు  పేర్కొన్నారు.