19 March, 2026 | 5:42 AM

వాట్సాప్ లొకేషన్ ద్వారా డ్రగ్స్ సరఫరా

03-08-2024 01:40 PM

డ్రగ్స్ విక్రయాలపై విచారణలో కీలక విషయాలు

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో సంచలన విషయాలు

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయాలపై విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వరస దాడులతో డ్రగ్స్ ముఠాలు భయటపడుతున్నాయి. డ్రగ్స్ కావలంటే వచ్చి తీసుకెళ్లాలని బెంగళూరు ముఠాలు చెబుతున్నాయి. ఈ ముఠాలు ఆన్ లైన్ లో డబ్బు చెల్లిస్తే వాట్సాప్ ద్వారా లోకేషన్ షేర్ చేస్తున్నాయి. వాట్సాప్ లోకేషన్ ద్వారా అనుమానం రాకుండా డ్రగ్స్ అమ్మకాలు జోరుగా జరుతున్నాయి. డ్రగ్స్ నేరుగా చేతికి ఇవ్వకుండా చెప్పిన స్థలంలో పెట్టి వెళ్లిపోతున్నారు. బెంగళూరులోని కీలక వ్యక్తిని పట్టుకోవడానికి అధికారులు వెళ్లారు.