03-11-2025 02:30:08 AM
జోధ్‌పూర్, నవంబర్ 2: రాజస్థాన్ రా ష్ట్రం జోధ్‌పూర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్ర క్కును టెంపో ట్రావెల్ ఢీకొట్టడంతో 15మం ది మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
జోధ్‌పూర్‌లోని సుర్సానగర్ నివాసితులు కోలాయత్ ఆలయాన్ని సందర్శించి జోధ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా భారత్ మాల ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఫలోడి పోలీస్ సూపరిండెంట్ కుందన్ కన్వారియా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత ఒసియ న్‌లోని ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గ్రీన్ కారిడార్ ద్వారా జోధ్‌పూర్‌కు తరలించినట్లు తెలిపారు.