calender_icon.png 3 November, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు

03-11-2025 02:28:28 AM

  1. పిల్లలతో సహా 23మంది దుర్మరణం.. పలువురికి గాయాలు
  2. మెక్సికోలో విషాదం

మెక్సికో నవంబర్ 2 : వాయువ్య మెక్సికోలో వారాంతం విషాదకరంగా మారింది. హెర్మోసిల్లో నగర కేంద్రంలోని ఒక డిస్కౌంట్ స్టోర్(సూపర్ మార్కెట్)లో శనివారం భారీ పేలుడు సంభవించి పిల్లలతో సహా 23మంది మృతిచెందారు. మరో 12మంది వరకు గాయపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మెక్సికో ఈ వారాంతంలో మరణించిన వారిని గౌరవించే, గుర్తుంచుకునే రంగురంగుల ఉత్సవాలతో డెడ్ డేను జరుపుకుంటోందని పేర్కొంది. సోనోరా రెడ్ క్రాస్ తన 40 మంది సిబ్బంది, 10 అంబులెన్సులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని సంస తెలిపింది.

ప్రమాదంపై ఎవరేమన్నారంటే..

ఎక్కువ మరణాలలు విషవాయువులను పీల్చడం వల్ల సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదికను పరిశీలిస్తే తెలుస్తోందని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ పేర్కొన్నారు. కాగా,  ‘సమగ్ర, పారదర్శక దర్యాప్తునకు ఆదేశించాను’ అని సోనోరా రాష్ట్ర గవర్నర్ డ్యూరాజో తెలిపారు.

‘ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సంతాపం‘ అని మెక్సికోఅధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి సహాయం చేయడానికి సహాయక బృందాలను పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పుడు మంటలు ఆర్పబడ్డాయి, దీనికి కారణం ఇంకా అస్పష్టంగా ఉంది. కొన్ని మీడియా సంస్థలు విద్యుత్ వైఫల్యం కారణమని ఆరోపించిందని.. ప్రముఖ డిస్కౌంట్ చైన్ వాల్డోస్లో భాగమైన దుకాణం దాడికి గురి కాలేదని నగర అధికారులు తెలిపారు.