నర్సుల సేవలు మరువలేనివి
ఓజోన్ దవాఖానల చైర్మన్ డాక్టర్ సత్యసాయిప్రసాద్
ఎల్బీనగర్, మే 15 : దవాఖానల్లో రోగులకు నర్సులు చేస్తున్న సేవలు మరువ లేనివని ఓజోన్ దవాఖానల చైర్మన్ డాక్టర్ సత్యసాయిప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ నర్సు దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ దవాఖానలో ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్‌వైన్‌ఓవెన్ ముఖ్యఅతిథిగా హాజరై నర్సులకు సర్వే కల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫ్రీ వ్యాక్సిన్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్య సాయిప్రసాద్, డిప్యూటీ హైకమిషనర్ ఓవెన్ మాట్లాడుతూ.. నర్సులు నడిచే దేవతలు అన్నారు. రోగులకు తర్వగా కోలుకోవడానికి నర్సులు చేస్తున్న సేవలే కారణమన్నారు. మహిళలు వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా గర్భాశయ క్సాన్సర్ నివారణకు వైద్యపరీక్షలు చేయించుకుని, వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాల న్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నివారణ చాలా సులభమన్నారు. మహిళందరికీ గర్భాశయ క్యాన్సర్‌తో పాటు నివారణ చర్యలపై అవగాహన ఉండాలని సూచించారు. నర్సులు చేస్తున్న సేవలను కొనియడి, నర్సులను సన్మానించారు. కార్యక్రమంలో ఓజోన్ దవాఖానల ఎండీ దీప్తి, వైద్యులు ఇంద్రాసేనారెడ్డి, పూజిత, సీహెచ్ శ్రీనివాస్‌రావుతో పాటు నర్సులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.




