calender_icon.png 25 May, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యానికి గరం మసాలా

25-05-2025 12:00:00 AM

నాన్ వెజ్ ప్రియులు గరం మసాలాతో చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. మన ఇంట్లో వివిధ ఆహార పదార్థాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. గరం మసాలా అనేది లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకుల మిశ్రమం. దీనిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

మసాలాను ఆహార పదార్థాల్లో పరిమితంగా ఉపయోగిస్తే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గాలనుకునేవారికి గరం మసాలా మేలు చేస్తుంది. దీనిని ఆహార పదార్థాల తయారీలో వాడటం వల్ల జీవక్రియ రేటు పెరిగి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

గరం మసాలాలో గుండెకు మేలు చేసే యాలకులు ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గరం మసాలాలో ఉండే కొన్ని పోషకాలు శరీరంలో క్యాన్సర్ సంబంధిత కణితుల పెరుగుదలను తగ్గిస్తాయి.