ఇండోర్‌లో ఏడుగురి సజీవ దహనం
ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు
భోపాల్, మార్చి 18: ఇంటి బయట ఛార్జింగ్‌కు పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమైన ఘటన మధ్యప్రదే శ్‌లోని ఇండోర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చనిపోయిన వారి లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం బయట పా ర్క్ చేసిన ఎలక్ట్రిక్ కారుకు తెల్లవారుజామున ఛార్జింగ్ పెట్టారు.
ఒక్కసారిగా ఆ ఛార్జింగ్ పా యింట్ వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు భవనం మొత్తానికి వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన సు మారు 10 గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో మంటల తీవ్రత ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భవనానికి ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ కూడ పనిచేయలేదు. దీంతో తలుపులు తెరుచుకోక బాధితులు బయటపడలేకపోయారు. లోపలే చిక్కుకుని పొగతో ఊపిరాడక మృత్యువు పాలయ్యారు.
ఈ భవ నం యజమాని మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో ఇంటిలో పాలి మర్ మెటీరియల్ నిల్వ చేశారని, దాని వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌కు సంబంధించి నిపుణుల కమిటీతో విచారణ జరిపి, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.




