15-11-2025 10:01:37 PM
ఏరియా పర్సనల్ డివైజిఎం సిహెచ్ అశోక్..
మందమర్రి (విజయక్రాంతి): స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విపత్తులను ఎదుర్కొనే ముందు స్వీయ రక్షణ పాటించాలని సింగరేణి ఏరియా పర్సనల్ డివైజిఎం సిహెచ్ అశోక్ సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహిస్తున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ క్యాంప్ ఫర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు, నవంబర్ 15 నుండి 17 వరకు మూడు రోజుల పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విపత్తు నిర్వహణ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, శిబిరాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
చిన్న వయస్సు నుండే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో శిక్షణ పొందడం వల్ల క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మ రక్షణ అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. అనుకోని విపత్తులు సంబంధించినప్పు డు, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించేందుకు సిద్ధపడే ముందు విద్యార్థులకు ఆత్మ రక్షణ సూత్రాలు, రక్షించాల్సిన విధులపై అవగాహన సూచనలు ఈ శిబిరంలో వివరించడం జరుగుతుంద న్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా క్రమశిక్షణతో పాటు సేవాభావం పెరుగు తుందన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యా యులు జె పురుషోత్తం, క్యాంప్ లీడర్ వెంకటస్వామి, గోలేటి సింగరేణి పాఠశాల పిఈటి భాస్కర్, ఇంచార్జ్ ఏ శ్రీనివాస్, పిఆర్ఓ దయాకర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.