10-02-2025 12:59:11 AM
మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : సత్ గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి పునస్కరించుకొని ఈనెల 15న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సత్ గురు సేవాలాల్ మహారాజ్ ఉత్సవ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీని వైభవంగా నిర్వహిస్తు న్నట్లు సేవాలాల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చత్రపతి నాయక్ తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన్ భవన్ లో మీడియా స మావేశంలో ఆయన మాట్లాడు తూ మెట్టు గడ్డ చౌరస్తా నుంచి అయ్యప్ప గుట్ట వరకు బంజారా వేషధారణతో నృత్యాలు శోభ యాత్ర నిర్వహిస్తున్నట్లు చత్ర పతి నాయక్ అన్నారు.
సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దై వం, భవిష్యవాణి జరగబోయే వాటిని ఆ కాలంలోనే ఆయన భవిష్యవాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు. బంజారాల నాయకులు మే ధావులు విద్యార్థులు పాల్గొని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో శోభయాత్ర కమిటీ అధ్యక్షులు రఘునాయక్, వెంకీ విజే, కోశాధికారి జే రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.