10-02-2025 01:01:47 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 9: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పాత ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వ డంతో ఘటన స్థలానికి చేరుకొని మంటల ను ఆర్పివేశారు. ఆ తర్వాత అందులో గుర్తు తెలియన వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
ఆ వ్యక్తిని చంపి కార్యాలయానికి నిప్పు పెట్టారా? లేదంటే చెలరేగిన మంటల్లో కాలి చనిపోయారా? ఎక్కడో చంపి ఈ మంటల్లో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. కాగా ఆఫీసులోని పాత భూదస్త్రా లు కాలిబూడిద అయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా.. లేదా.. ఆగంతకులు ఎవరైనా కావాలనే నిప్పంటించారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.