10-02-2025 12:58:46 AM
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
రాజేంద్రనగర్ (కార్వాన్), ఫిబ్రవరి 9: తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు టి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్ లో ఉన్న జపాన్ కరాటే అకాడమీ మాస్టర్ దయానంద్ కుమార్ శిష్యురాలు కావలి జిషిత గచ్చిబౌలిలో జరిగిన ఆలిండియా కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కూరాకుల కృష్ణ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మరింత ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.