01-08-2025 12:18:38 AM
అయిజ జులై 31.ఐజ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ స్కూల్ బస్సులను గురువారం రవా ణా శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గద్వాల జిల్లాలో ఆర్టి ఏ అధికారులు సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రవేట్ స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్కూల్ బస్సులు కండిషన్ లేకున్నా, ఫిట్నెస్ లేకుండా మరియు పర్మిషన్ లేకున్నా డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రోడ్లపైకి అట్టి వాహనాలు వస్తే అలాగే స్కూల్ బస్ డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఉపేక్షించేదే లేదని అధికారులు సూచించారు.