calender_icon.png 14 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

14-09-2025 06:59:03 PM

చండూరు,(విజయక్రాంతి): చండూర్ భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI‌)నల్గొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు  చండూరు పట్టణ  కేంద్రంలో‌ శీలా అనసూయ పంక్షన్ హల్ లో    ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ  TPTLరాష్ట్ర అధ్యక్షులు  విజయ్ కుమార్ మాట్లాడుతూ  కేంద్ర లో వున్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులను మద్యలోనే ఆపివేసేందుకు కంకణం కట్టు కున్నాయని ఆయన అన్నారు. విద్యారంగాన్ని మతోన్మాద కాషాయికరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా అన్ని  రాష్ట్రాలపై రుద్దడం  జరుగుతుందని, విద్యారంగం లోకి   ముఢానమ్మకాలు  మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బిజెపి విద్యారంగంలో ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని ఆయన అన్నారు.

 తెలంగాణ  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముల్కలపల్లి రాములు  మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం లో మార్పు కావాలి కాంగ్రెస్  రావాలి అని ఎన్నికల ప్రచారంలో  అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని ఆచరణ గడప దాటడం లేదని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యా కోనసాగించే SC,ST,BC పేద మధ్యతరగతి విద్యార్థుల బకాయి లో వున్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వేంటనే విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ లో కుసున్న తరువాత  కనిసం తెలంగాణ రాష్ట్రం లో  విద్యా శాఖ మంత్రి ని నియమించలేని అసమర్థ ప్రభుత్వం  కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో భవిష్యత్ లో మార్పు తీసుకురావడం కోసం విద్యార్థి లోకం ఎదురు చూస్తుందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో SC,ST,BC సంక్షేమ హాస్టళ్లలో వుండే పేద మధ్యతరగతి విద్యార్థుల కు గత 8నెలలుగా విద్యార్థులకు  మెస్ కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయకుండా వుంటే పేద మధ్యతరగతి విద్యార్థుల అర్ధాకలితో ఏవిధంగా విద్యాను అభ్యసిస్తారొ తెలంగాణ రాష్ట్రంలో వున్న మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న మంత్రుల, ఎమ్మేల్యేల జీతాలు కనీసం ఒక్క నెల అయిన బకాయిలో వున్నాయా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈనెల 15నుంచి ప్రయివేటు కళాశాల యాజమాన్యం సమ్మెకు పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం అని తక్షణమే విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ SFI చేపట్టే పోరాటం లో  విద్యార్థి లోకం  సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.