10-10-2025 12:19:35 AM
రెండో రోజు క్రీడల కోలాహలం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేం ద్రంలోనీ ప్రకాశం స్టేడియంలో నిర్వహించబడుతున్న 69వ పాఠశాలల ఎస్ జి ఎఫ్ జి ల్లా స్థాయి క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.
రెండవ రోజు అయినా గురువా రం జరిగిన పోటీల్లో విజేతల వివరాలు...అండర్ 17 బాలుర విభాగంలో కబడ్డీ... మొదటి బహుమతి ఇల్లందు, ద్వితీయ స్థానం అశ్వారావుపేట, తృతీయ స్థానం కొత్తగూడెం జో న్లు దక్కించుకున్నాయి అదేవిధంగా ఖోఖో క్రీడలో ప్రథమ బహుమతి అశ్వారావుపేట, ద్వితీయ బహుమతి కొత్తగూడెం, తృతీయ బహుమతి పాల్వంచ జోన్లు దక్కించుకోగా, వాలీబాల్ క్రీడలో పాల్వంచ ప్రథమ బహుమతి ఇల్లందు ద్వితీయ బహుమతి కొత్తగూడెం తృతీయ బహుమతులు దక్కించుకున్నాయి.
అండర్ 17 బాలికల విభాగం లో...కబడ్డీ క్రీడలో. ఇల్లందు ప్రథమ బహుమతిని అశ్వారావుపేట ద్వితీయ బహుమ తిని భద్రాచలం తృతీయ బహుమతిని, ఖో ఖో క్రీడలో భద్రాచలం ప్రధమ బహుమతిని అశ్వారావుపేట ద్వితీయ బహుమతి ఇల్లందు తృతీయ బహుమతిని దక్కించుకుకోగా,వాలీబాల్ క్రీడలో ప్రథమ బహుమతి ని అశ్వారావుపేట ద్వితీయ బహుమతి ఇల్లం దు తృతీయ బహుమతి భద్రాచలం దక్కించుకున్నాయి.
అండర్ 14 బాలుర విభాగంలో...
కబడ్డీ క్రీడలో పాల్వంచ మొదటి బహుమతి, అశ్వరావుపేట ద్వితీయ బహుమతి , పినపాక తృతీయ బహుమతి.... ఖో. ఖో. వి భాగంలో అశ్వరావుపేట మొదటి బహుమ తి పాల్వంచ ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి దక్కించుకున్నాయి వాలీబాల్ లో పాల్వంచ మొదటి బహుమ ఇల్లందు ద్వితీయ బహుమతి కొత్తగూడెం జోన్లు తృతీయ బహుమతి దక్కించుకున్నాయి.
అదేవిధంగా అండర్ 14 బాలికల విభాగంలో....
వాలీబాల్ క్రీడలో ప్రథమ బహుమతిని పాల్వంచ ద్వితీయ బహుమతిని అశ్వరావుపేట ద్వితీయ బహుమతి ఇల్లందు జోన్లు ద క్కించుకోగా బాలికల కబడ్డీ క్రీడలో ప్రథమ బహుమతిని ఇల్లందు ద్వితీయ బహుమతి పాల్వంచ తృతీయ బహుమతి అశ్వరావుపే ట దక్కించుకోగా, ఖో ఖో క్రీడలో ప్రథమ బ హుమతిని ఇల్లందు, ద్వితీయ బహుమతిని భద్రాచలం తృతీయ బహుమతి ని అశ్వరావుపేట జోన్లు దక్కించుకోవడం జరిగినది.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డిఇఓ నాగలక్ష్మి డి వై ఎస్ ఓ ఓపరంధామ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులైన సీత,సుజాత, బుగ్గ వెంకటేశ్వర్లు, భావ్ సింగ్ లక్ష్మణ్,శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.