calender_icon.png 10 October, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకొడిగా దరఖాస్తులు

10-10-2025 12:18:16 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబ రు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా అక్టోబర్ 9వ తేదీ వరకు  జిల్లా వ్యాప్తంగా 34 మంది దరఖాస్తులు చేసున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ గురువారం పేర్కొన్నారు.

జిల్లాలోని 32 మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈనెల 18వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించిందని, డిసెంబరు 1వ తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూప డం లేదు. దరఖాస్తులు రెండు లక్షల నుండి 3 లక్షలకు పెంచడంతో వ్యాపారస్తులు కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మద్యం టెండర్లు సజావుగా చేపట్టాలి..

జిల్లాలో మద్యం టెండర్లు సజావుగా చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అధికారులకు సూచించారు. నూతన మద్యం టెండర్ల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న అబ్కారీ శాఖ కార్యాలయంను సందర్శించారు.

ఈ సందర్భంగా మద్యం టెండర్లలో దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ నెల 18న  దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నేపథ్యంలో రెండో శనివారం(11న) దరఖాస్తులు స్వీకరించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ అధికారి జ్యోతి కిరణ్, సిఐలు రవి, రమేష్ కుమార్, సిబ్బంది ఉన్నారు.