10-10-2025 12:19:38 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్లకు గత 7 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బిసి సంక్షేమ శాఖ అధికారి శివకుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ వేతనాలు సకాలంలో రాకపోవడంతో వర్కర్లు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో The leaders are Komuraiah, Lakshmi, Sarada, Parvathy, Saroja, Jyoti, and Poshakanka. తదితరులు పాల్గొన్నారు.