24-01-2025 12:00:00 AM
ఫ్యాషన్ ప్రపంచంలో డెనిమ్ ఎప్పుడు టాప్‌లోనే ఉంటుంది. ఈ డెనిమ్ డ్రెస్సులు ఎవరి లుక్స్‌నైనా ఇట్టే మార్చగలవు. కాలేజెస్, ఆఫీసెస్ ఇలా ఎక్కడికెళ్ళినా డెనిమ్‌తో మంచి అదిరిపొయే లుక్‌ను సొంతం చేసుకోవచ్చు. అందుకే డెనిమ్ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మళ్లీ సరికొత్తగా వస్తుంటాయి. ఎప్పటి నుంచో మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న డెనిమ్ ఈ ఏడాది మరింత ఆకట్టుకుంది. డెనిమ్ జాకెట్స్, ప్యాంట్లూ దాటి డబుల్ డెనిమ్ ఫ్యాషన్ అయ్యింది. స్కర్ట్, లాంగ్ ఫ్రాక్.. ఇలా అన్ని రకాల డ్రెస్సుల్లోనూ ఒదిగిపోయింది. పెద్దలతో పాటు పిల్లల కోసమూ ఎన్నెన్నో వెరైటీల్లో వచ్చింది ఈ డెనిమ్ ట్రెండ్.