calender_icon.png 1 May, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శర్వా38.. భోగి

01-05-2025 01:11:48 AM

ఇటీవల ‘ఓదెల2’ చిత్రంతో థియేటర్లలోనూ మల్లన్న జాతర వాతావర ణాన్ని సృష్టించారు డైరెక్టర్ సంపత్ నం ది. తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్టు ‘శర్వా38’ ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్టుగా ‘శర్వా38’ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్‌ను తాజా గా రివిల్ చేశారాయన. ఫస్ట్ స్పార్క్  అనే పేరుతో విడుదలైన పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో ఇది. ఈ చిత్రానికి ‘భోగి’ టైటిల్ అనే టైటిల్‌ను ఖరారు చేశామని, షూటింగ్ బుధవారమే ప్రారంభించామని ఈ వీడియో ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమైంది.

ఉత్తర తెలంగాణ సరిహద్దులోని బొగ్గుగుట్ట అనే ఊరిలో 1960లో జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించనున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె పనిచేస్తున్నారు. మిగతా టీమ్ వివరాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.