కామ్రేడ్ కళ్యాణ్ విడుదలయ్యేది అప్పుడే!
హీరో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తోపాటు రొమాన్స్, ఎమోషన్స్‌తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయిక కాగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
1992లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో శ్రీవిష్ణు కామ్రేడ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్; ఎడిటర్: చోటా కే ప్రసాద్.






