calender_icon.png 5 September, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బాయిలతో మాట్లాడే చాన్స్ దొరకలేదప్పుడు!

03-09-2025 12:45:28 AM

మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకి శివానీ నాగరం మీడియాతో పంచుకుంది.  

--అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ సెలెక్టివ్‌గా వెళ్లాలని ఎదురుచూశాను. ఇప్పుడు థియేటర్ దాకా వెళ్లి చూడాలనిపించే సినిమాలు రావటం లేదు. అలా కంటెంట్ ఉన్న మూవీ చేయాలని కొద్దిగా టైమ్ తీసుకున్నా.

-సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి నా బాల్య మిత్రుడు. ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ ప్రతి పాత్రనూ తీర్చిదిద్దిన తీరు బాగా నచ్చింది. కంప్లీట్ లైట్ హార్టెడ్ మూవీ ఇది. ప్రేమకథ ఉన్నా, అందులో భావోద్వేగపూరితమైన అంశాలు ఉండవు. కాలేజీ రోజుల్లో ఉండే వినోదంతో సాగుతుంది. 

- ఈ సినిమాలో నేను కాత్యాయని అనే పాత్రలో నటించా. ప్రేక్షకులు తమను పోల్చుకునేలా ఉం టుందీ పాత్ర.. నా వ్యక్తిగత జీవితానికీ దగ్గరగా ఉంటుంది. కాలేజ్‌లో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. సినిమాలో అఖిల్, కాత్యాయని స్నేహం, ప్రేమ.. అందరికీ కాలేజీ రోజులు గుర్తుకుతెస్తాయి. నాకు స్కూల్, కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. వేసవి శిబిరానికి వెళ్లిన అనుభూతి కలిగింది. నేను చదివింది గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్. అప్పుడిలా అబ్బాయిలతో మాట్లాడే అవకాశం లేదు. 



l థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడాలనుకోవడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సిందే. ఓటీటీలో వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. తొలి చిత్రంలో బాగా ఏడ్చేశా. రెండోది ‘లిటిల్ హార్ట్స్’.. నవ్వించే పాత్ర దొరికింది. ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుకుంటున్నా. నెక్ట్స్ సుహాస్‌తో ‘హే భగవాన్’లో నటిస్తున్నా. ఇదొక కంప్లీట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేశాం. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇవేకాకుండా మరో రెండు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.