3 July, 2026 | 7:10 AM

పిడుగు పడి 39 గొర్రెలు మృతి..

18-10-2024 05:30 PM

హుజూర్ నగర్: నేరేడుచర్ల మండలం బోడలదిన్న గ్రామంలో పిడుగు పడి 39 గొర్రెలు మృతి చెందాయి. బోడల్దిన్నలో వర్షం పడే సమయంలో పొలాల వద్ద గొర్రెలను మెపుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లెపూల లింగయ్య, యాలకాని ఆంజనేయులుకు చెందిన 300 గొర్రెల గుంపుపై పిడుగు పడి అందులో 39 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.