calender_icon.png 29 July, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్ హసీనాకు రఫేల్ విమానాలతో.. ఇండియన్ ఆర్మీ భద్రత

06-08-2024 02:40:45 PM

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో తన ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా సోమవారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు. భారత్ వైపు ఆమె విమానం రావడాన్ని గుర్తించిన భారత వైమానిక దళం, షేక్ హసీనాను గట్టి భద్రతతో డిల్లీకి తీసుకొచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ ఎయిర్ క్రాఫ్ట్‌కు పశ్చిమ బెంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరానికి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయని మిలిటరీ అధికార ప్రతినిధి వివరించారు.భారత వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.