calender_icon.png 29 July, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో రెండ్రోజులు భారీ వర్షాలు

06-08-2024 03:07:11 PM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, కాలువలు, చెరువులు పొంగిపోయి జలమయం అవుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వానాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని, రేపు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్ హనుమకొండ జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని ఆరు జిల్లాలకు అధికారులు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.