calender_icon.png 30 July, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

29-07-2025 03:10:30 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ... రాబోయే 3 నెలల కాలంలో రీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున రీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఆసుపత్రులలో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు సందర్శించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రులలో జ్వర వార్డులలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది, మందుల వివరాలు, ల్యాబ్ లలో చేస్తున్న వైద్య పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం, పారిశుధ్య నిర్వహణ, ఇప్పటి వరకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి నమోదైన కేసుల వివరాలు, జ్వర పీడితులకు అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు.