calender_icon.png 30 July, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో పర్యవేక్షణ లోపం

29-07-2025 03:14:48 PM

 ప్రిన్సిపల్ పై ఎమ్మెల్యే ఆగ్రహం

హుజురాబాద్,(విజయక్రాంతి):  పాఠశాలలో పర్యవేక్షణ లోపం పల్లె విద్యార్థులను ఎలుకలు కొరికాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎంజేపీ సైదాపూర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఇటీవల అక్కడ విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు ఉత్తమంగా నడిచాయి.

ఇప్పటివరకు గురుకులల్లో 100కి పైగా విద్యార్థులు మృతి చెందారు అని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలో పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయన్న ఎమ్మెల్యే, ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు .మీ పిల్లలను ఎలుకలు కరిచితే ఇలాగే చూడగలరా...? అని ప్రశ్నించారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్న ఆయన కేసీఆర్ హయాంలో ఒక్కో విద్యార్థిపై రూ.1,25,000 ఖర్చు చేసి ఉత్తమ విద్యను అందించారు అని గుర్తు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే, బాధ్యత లేకుండా వ్యవహరించిన ప్రిన్సిపల్ రాణిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిత్వ పదవిని సీఎం చేతిలో పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఆరోపించారు.బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని, విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.