calender_icon.png 30 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూముల్లో ఆక్రమాలపై హైడ్రా ఆగ్రహం

06-08-2024 01:54:00 PM

హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూముల్లో ఆక్రమాలపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు కబ్జాదారులు ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను అడ్డు అదుపు లేకుండా కబ్జాల చేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఆగ్రమణకు గురవుతుండడంతో హైడ్రా కన్నెర్ర చేసింది. తాజాగా గాజులరామారంలో చెరువు శిఖం భూముల్లోని 52 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దేవేంద్రనగర్ చింతల చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది కూల్చివేస్తుంది. సర్వే నంబర్ 329, 342లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేస్తున్నారు.