31-08-2025 05:45:15 PM
5వ రోజు రుద్రాక్షేశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు
పటాన్ చెరు,(విజయక్రాంతి): గణేష్ నవరాత్రులు ఒకవైపు ఆదివారం సెలవు దినం కావడంతో గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. 5రోజు ప్రత్యేక పూజలు, గణపతి హోమం అనంతరం స్వామి వారిని రుద్రాక్షేశ్వరుడిగా అలంకరించారు. అన్నదాన కార్యక్రమంతోపాటు, సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు చేసిన నాట్యం, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక వేదిక లేని లోటు స్పష్టంగా కనిపించింది. కళా ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి శాశ్వతంగా మిని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయపడ్డారు.