calender_icon.png 10 November, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయంలో శిఖర పూజ

10-11-2025 06:46:37 PM

భైంసా (విజయక్రాంతి): కుంటాల మండలంలోని పోలా గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నంది లింగం శిఖర ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజారి జ్ఞానేశ్వర్ రాజు ఆధ్వర్యంలో ఉదయం నుండే యజ్ఞం పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ట చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు వినోద్ కవితలకు భక్తులకు సన్మానం చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు.