calender_icon.png 10 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర మరువలేనిది

10-11-2025 06:49:14 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాయపూడి వెంకట్ నారాయణ..

కోదాడ: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ జననీ జన కేతనం రచయిత అందే శ్రీ ఆకస్మిక మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాయపూడి వెంకట్ నారాయణ అన్నారు. సోమవారం కోదాడలో రాయపూడి స్వగృహంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం పేదల పక్షాన గొంతుకు వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అందెశ్రీ అని అన్నారు.

అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజలను చైతన్యపరచిన గొప్ప యోధుడు అని కొనియాడారు. అందే శ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.