calender_icon.png 24 December, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స కోసం ఎల్ఓసీ మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

24-12-2025 05:47:23 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన పొలం మల్లేష్ కి రూ.2,50,000 ఎల్ఓసీ మంజూరు చేసి ఇప్పించారు. మంథని  బట్టుపల్లి  గ్రామానికి చెందిన పొలం మల్లేష్ అనారోగ్య కోసం వైద్య చికిత్సకు సంబంధించిన 2,50,000 ఎల్ఓసీ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స  పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలుపగా వెంటనే సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2,50,000 వేల ఎల్ ఓసీని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేశారు.  ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో  అందచేశారు. చికిత్స కోసం 2,50,000 వేల ఎల్ ఓసి మంజూరు చేపించి మంత్రి శ్రీధర్ బాబు కు కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. మంత్రి శ్రీధర్ బాబు కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.