calender_icon.png 1 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో మెరిసిన షైన్ విద్యాసంస్థలు

01-05-2025 12:14:45 AM

వరంగల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో వరంగల్ నగరంలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులై విజయ పరంపర కొనసాగించారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరుందిన షైన్ విద్యార్థులు జిల్లాకు తలమానికంగా నిలిచారని, షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’ నే కాదని, అన్ని రంగాల్లో తామే ముందుంటామని మరోసారి రుజువయిందని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ అన్నారు.

షైన్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు బి.ఆదిత్య దీక్షిత్ 588/600, జి. జ్ఞాన దీప్ 580/600, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ వరసగా 579/600 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సాయి శ్రీ 578/600, మని చందన 577/600,  కార్తిక, త్రిషిక పటేల్ 576/600, సంప్రీత్ 575/600, రాజేష్ 574/600 మార్కులతో ఉత్తీర్ణులై రికార్డు సృష్టించారని తెలిపారు.

ఇక తమ విద్యాసంస్థలకు చెందిన 23 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు, 53 మంది విద్యార్థులు 560 కి పైగా మార్కులు, 92 మంది విద్యార్థులు 550 కి పైగా మార్కులు, 371 మంది 500 కు పైగా మార్కులు సాధించి 15నై త్రీ నగరిలోనే కాకుండా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో గెలిచినట్లు చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు.

అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్లు పి. రాజేంద్ర కుమార్, మూగల రమ, ఐఐటి కోఆర్డినేటర్ మూగల రమేష్, ఎర్రగట్టు గుట్ట షైన్ చైర్మన్ జే. శ్రీనివాస్, ప్రిన్సిపాల్లు జి.రాజకుమార్, పి. విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ మానసిక వికాసం విలువలతో కూడిన విద్యను అందిస్తూ నూతన సమాజ నిర్మాణమే విద్యాసంస్థల లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు.