calender_icon.png 1 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ హైస్కూల్ జిల్లా మొదటి ర్యాంక్

01-05-2025 12:13:25 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 30 (విజయక్రాంతి):  పదవ తరగతి ఫలితాల్లో భువనగిరి పట్టణానికి చెందిన విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా మొదటి ర్యాంకును సాధించారు. విద్యార్థిని ఎం అక్షయ 587/600 మార్కు లతో జిల్లాలో మొదటి ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. పాఠశాలలో మొత్తం 66 మంది విద్యార్థులలో 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఏడుగురు, 500 పైగా మార్పులు సాధించిన విద్యార్థులు 23, 400కు పైగా మార్పులు సాధించిన విద్యార్థులు 58, మొత్తం విద్యార్థులు 66 అందులో ప్రధమ శ్రేణిలో తిరుగులేని వారు 64 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా మంచిర్యాంకులను సాధించామని విజ్ఞాన్ హై స్కూల్ చైర్మన్ పగిడాల జలంధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను చైర్మన్ దేవేందర్ రెడ్డి, కరస్పాండెంట్ పగిడాల పురేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ అపర్ణ, స్వాతి, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.