3 July, 2026 | 1:06 AM

పారాదీప్‌కు ‘హెరాల్డ్’ నౌక

03-07-2026 12:00 AM
  1. సురక్షితంగా ఇరాక్ నుంచి భారత్‌కు ఇంధన ట్యాంకర్
  2. హోర్ముజ్‌లో కాల్పులు.. సమయస్ఫూర్తితో ముందుకు

భువనేశ్వర్, జూలై 2: ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొచ్చిన ‘ఎంటీ సన్మార్ హెరాల్డ్’ సురక్షితంగా చేరుకుంది. ఈ విషయాన్ని గురువారం పోర్ట్ అథారిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ నౌకపై హోర్ముజ్ జలసంధిలో దాడి కూడా జరిగింది. అత్యంత క్లిష్టపరిస్థితులను సమర్థవం తంగా ఎదుర్కొని, నౌకలోని సిబ్బంది భద్రత దృష్ట్యా దాడి అనంతరం నౌక తన మార్గాన్ని మార్చుకుంది. భద్రతా ఉల్లంఘనలు లేకుండా ముందుకు కదులుతూ ఎట్టకేలకు పారాదీప్‌కు చేరింది.