28-08-2025 07:41:51 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని నర్సాపూర్ రోడ్డుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని గ్రామస్థులతో కలిసి జిల్లా వైద్యాధికారులు డిఎంహెచ్వో మల్లికార్జున రావు(District Medical Officer DMHO Mallikarjuna Rao) పరిశీలించారు. నివేదికలు ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏఎన్ఎంలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్థులు, మధుసూదన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మైకల్ తదితరులు ఉన్నారు.