28-08-2025 07:39:59 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా సమాచార సేకరణకు గురువారం స్థానిక మండల అధికారులు గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని బాదనకుర్తి, తర్లపాడు, అడవి సారంగాపూర్, మేడమ్ పెళ్లి, పాత తర్లపాడు, జిల్లేడు కుంట, గ్రామాల్లో రహదారి పైపులైన్లు కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ బృందంలో మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, తాసిల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు, పంచాయతీ కార్యదర్శులు పలువురు ఉన్నారు.