calender_icon.png 28 August, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండండి

28-08-2025 07:37:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో పాటు గురువారం రాత్రి కూడా వర్షం కురిసే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav), ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అధికారులకు సూచించారు. పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ వైయస్సార్ కాలనీ వరద ముంపు గురైన ప్రాంతాలను పంటలను కోతకు గురైన చెరువులను పరిశీలించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి వద్దకు వెళ్లేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని ఏదైనా అత్యవసర పనులు ఉంటే సహాయక కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.