calender_icon.png 28 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మొక్కలు నాటి సంరక్షించాలి

28-08-2025 07:35:05 PM

తాసిల్దార్ రామ్మోహన్..

బెజ్జూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో తహసిల్దార్ రామ్మోహన్(Tahsildar Rammohan) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో పండ్ల చెట్లు పూల చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కమిటీ సభ్యులకు సూచించారు. తహసిల్దార్ ఉసిరి చెట్టు, బాదం చెట్టు పలు మొక్కలను నాటారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్ కు సూచించారు. అనంతరం శ్రీ రంగనాయక స్వామి, శివాలయం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి పురాతనమైన ఆలయాలు బెజ్జూర్ లో ఉండడం ప్రజల అదృష్టమని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అందరూ ఏకమై ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జగ్గా గౌడ్,సామల తిరుపతి, శంకర్, భక్తులు పాల్గొన్నారు.