calender_icon.png 28 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మెట్పల్లి మాజీ జెడ్పిటిసి కాటిపెల్లి రాధా-శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ..

28-08-2025 07:23:10 PM

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల (విజయక్రాంతి): మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మెట్పల్లి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డిల కుమారుడు శ్రీకర్ రెడ్డి బుధవారం వినాయకుని తీసుకొచ్చేందుకు ట్రాక్టర్లో వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కెనాల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాదం నుండి బయటపడగా శ్రీకాంత్ గల్లంతయ్యాడు. కెనాల్ లో గల్లంతైన కుమారుడి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరు అవుతున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి స్వగృహం పెద్దాపూర్ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిలతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) శ్రీనివాస్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నీటిపారుదల శాఖ అధికారులతో  గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అనుకుంటేనే ప్రజలు బయటకు రావాలని ఆయన కోరారు. ఈ పరామర్శలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్ మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం మండల అధ్యక్షులు అంజిరెడ్డి మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జీవాకర్ రెడ్డి మెట్పల్లి డివిజన్ పోలీస్ అధికారి రాములు కోరుట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి వివిధ శాఖల అధికారులు నాయకులు ప్రజా ప్రతినిధులు  కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.