28-08-2025 07:27:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిఆర్ఎస్ పార్టీ జిల్లా సమన్వయకర్త కె రామ్ కిషన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ముంపుకు గురైన జిఎన్ఆర్ వైయస్సార్ కాలనీ సందర్శించి కోతకురైన బంగాళపేట చెరువును పరిశీలించారు. పంట పొలాల్లో ఇసుకలు పోసిన రైతులను పరామర్శించి ఎకరానికి 10,000 నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేష్ నజీర్ నజీమ్ నయీమ్ రిజ్వాన్ తదితరులు ఉన్నారు.