calender_icon.png 21 November, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్‌లో కాల్పుల కలకలం

21-11-2025 12:00:00 AM

  1. ఆటో కిరాయి గొడవతో ఎయిర్ గన్‌తో ఫైరింగ్
  2. ప్రయాణికుడు సమీర్ దాస్ కడుపులోకి దూసుకెళ్లిన తూటా
  3. నర్కుడాలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు

మణికొండ, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఆటో కిరాయి విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాల్పులకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ లం నర్కుడ గ్రామంలో గురువారం ఎయిర్ గన్ కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీర్ దాస్, అతని మేనల్లుడు పింటూ నర్కుడాలో వెళ్లేందుకు ఒక ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో కిరాయి విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆగ్రహంతో ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సమీర్ దాస్ కడుపులోకి తూటా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సమీర్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి మేనల్లుడు పింటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.