21-11-2025 12:00:00 AM
చేవెళ్ల, నవంబర్ 20 (విజయక్రాంతి) : హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారికి 2017లో టెండర్ పిలిచారని, ఈ విష యంపై తాము కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో సమావేశమై మంజూరు తీసుకువచ్చా మని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్- హైవే అప్పా జంక్ష న్ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర రోడ్డును అతి త్వరలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్ మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కొడంగల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో త్వరితగతిన హైదరాబాద్ - బీజాపూర్ 163 జాతీయ రహదారిని పూర్తి చేస్తామని చేవెళ్ల క్యాంపుకార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారి విషయమై ఎన్నో సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలపడం జరిగిందని ఆయన ఈ యొక్క విషయంపై ఎన్జీవో సంస్థతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించగల దిశగా కృషి చేశారని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. గత నెల 31వ తేదీ కోర్టు కేసులు కొట్టివేయడం జరిగిందని..
ఆ వెంటనే మే మంతా సీఎంకు తెలపడంతో సీఎం ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే ఈ విషయంపై మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి తెలపడంతో వారు మూడు టీములుగా ఏర్పడి పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. నిర్ణీత గడువు విధించిన సమయంలోపే రోడ్డు పూర్తి నిర్ణీతచేయాలనే ఉద్దేశంతో పనులను వేగవంతంగా నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారు.
ఈ సమావేశం లో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణ రెడ్డి, కాలే శ్రీకాంత్, పీ ఏ సీ ఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య, వైస్ చైర్మన్ రాములు, మాజీ సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాములు, వసంతం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.