06-01-2026 12:40:28 AM
వాషింగ్టన్, జనవరి ౫: అమెరికాలోని ఓహియో సిన్సినాటి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై సోమవారం గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపడం కలకలం రేపింది. కాల్పుల్లో ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. కాల్పుల శబ్దం వినబడగానే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
దాడి జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడి కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ముప్పు తప్పినట్లయింది. దుండగులు ఉపాధ్యక్షుడి ఇల్లే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నిందితుడు ఇంటి బయట నుంచే కాల్పులు జరిపాడని, లోపలికి ప్రవేశించలేదని అధికారులు ధ్రువీకరించారు.