06-01-2026 12:43:44 AM
మిగతా నిందితుల కంటే వీరిద్దరిపై అభియోగాలు భిన్నం
ఇలాంటి దశలో వారికి బెయిల్ ఇవ్వలేం: సుప్రీం కోర్టు
ఇదే కేసులో మరో ఐదుగురికి ఊరట.. వారికి బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ, జనవరి ౫: ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కుట్ర కేసులో సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం తోసిపు చ్చింది. ఖలీద్‌తోపాటు ఇదే కేసులో షర్జీల్ ఇమామ్‌కూ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కాకుండా ఇదే కోసు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహ్మద్ సలీంఖాన్, షాదాబ్ అహ్మద్‌కు బెయిల్ మంజూరు చేసి వారికి ఊరటనిచ్చింది.
ఖలీద్, షర్జీల్ ఇమా మ్ ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వారు నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఉపా చట్టం కింద తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇతర నిందితులతో పోలిస్తే నేరంలో వీరిద్దరి పాత్ర భిన్న మైనదని ప్రకటించింది. ఇలాంటి దశలో వారిద్దరికి బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని కోర్టు స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు హిం సాత్మకంగా మారి 53 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌తో పాటు మరికొందరిపై నాడు ఉపా కేసులు నమోదయ్యాయి.
ఇక ఇదే నా జీవితం: ఖలీద్
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బయట కు వచ్చిన ఉమర్ ఖలీద్‌తో తన సహచరి బానో జ్యోత్స్న లాహిరి మాట్లాడే ప్రయత్నం చేసింది. ‘రేపు నిన్ను కలవడానికి జైలుకు వ స్తాను’ అంటూ ఆమె చెప్పగా..‘తప్పకుండా వచ్చేయ్.. ఇక ఇదే నా జీవితం‘ (అబ్ యహీ జిందగీ హై) అంటూ ఖలీద్ భావోద్వేగానికి గురయ్యారు. ఖలీద్ తండ్రి సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖలీద్, షర్జీల్ ఇమామ్ మరో ఏడాది తర్వాతే మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించడం ఆశాజనకంగా ఉందని వారిద్దరి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.