1 August, 2026 | 11:22 PM

ప్రజలకు అనుకూలంగా ఉండాలి

24-08-2024 02:40 AM
  1. అవగాహన కార్యక్రమంలో సలహాలు, సూచనలు 
  2. ప్రభుత్వానికి నివేదిస్తామన్న కలెక్టర్

సిద్దిపేట, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆర్‌ఓఆర్ నూతన చట్టం ప్రజలకు అనుకూలంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘా ల నాయకులు అభిప్రాయపడ్డారు ధరణిలో 20 అంశాలతో మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, బార్ అసోసియుషన్, వివిధ ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆర్‌ఓఆర్ చట్టంపై అవగాహనతో కల్పించి, వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. 2012 నుంచి మాన్యువల్ విధానానికి స్వస్థి పలికి ఆన్‌లైన్‌కు తెరలేపారని, అప్పటి నుంచి అనేక కొత్త సమస్యలు తలెత్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ధరణని అమలు చేయడంతో మరిన్ని సమస్యలకు దారితీసిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్‌ఓఆర్ నూతన చట్టం అమలులో తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా ఆదనపు కలెక్టర్‌లకు పూర్తిస్థాయి అధికారాలు ఉండేలా రుపొందిం చాలని కోరారు. ఈ సూచనలు, సలహాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ మను చౌదరి వెల్లడించారు.