27-10-2025 12:44:13 AM
ముంబై, అక్టోబర్ 26 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం త్వరలో జరగనున్న మినీ వేలం పై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించేందుకు సిద్ధమైంది. 2024లో చాం పియన్‌గా నిలిచిన కేకేఆర్ 2025లో మా త్రం దారుణంగా విఫలమైంది.
దీంతో అప్ప టి వరకూ కోచ్‌గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్ కాం ట్రాక్ట్‌ను కేకేఆర్ యాజమాన్యం పొడిగించలేదు. అయితే 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ వరకూ టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన నాయర్ ఆ కాంట్రాక్ట్ ముగియ డంతో కేకేఆర్‌లో చేరా డు. ఇప్పుడు చంద్రకాంత్ పండిట్ స్థానంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.