04-01-2026 12:00:00 AM
భారత క్రికెట్ వన్డే జట్టులో సంచలన మార్పులు ఏమీ చోటు చేసుకోలేదు.. గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్ శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తే.. దేశవాళీలో రాణించిన ప్లేయర్స్‌కు నిరాశే మిగిలింది. ఖచ్చితంగా జట్టులోకి వస్తాడనుకున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. అలాగే పంత్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా కొనసాగించారు. నితీశ్‌కు మరో అవకాశమివ్వగా.. హార్థిక్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు.
బుమ్రా, హార్థిక్ పాండ్యాలకు విశ్రాంతి
షమీ, పడిక్కల్, రుతురాజ్‌లకు నిరాశ
ముంబై, జనవరి 3 : న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భార త జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే కెప్టెన్ శుభమన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించడంతో గిల్ మళ్లీ పగ్గాలు అందుకోనున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్య ర్ ఐసీయూలో చికిత్స తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచీ ఆటకు దూరమైన శ్రేయాస్ ఇటీవలే బెంగళూరులోని బీ సీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో కోలుకున్నాడు.
ఫిట్‌నెస్ సాధించినప్పటకీ బరువు తగ్గడం సీఓఈ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. అయినప్పటకీ వన్డే సిరీస్ కోసం వైస్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. జనవరి 6న విజయ్ హజా రే ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ ఫిట్‌నెస్‌ను సీఓఈ వైద్యులు అంచ నా వేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడితే వన్డే సిరీస్ కోసం జట్టుతో కలుస్తాడు. లేకుంటే సీఓఈకి వెళతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా అయ్యర్ రీఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడిం ది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో మెరుపు శతకం చేసినప్పటకీ జట్టు కూర్పు దృష్ట్యా అతన్ని తప్పించాల్సి వచ్చింది. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు కూడా చోటు దక్కింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో టాపార్డర్ బలంగా ఉంది.
ఇదిలా ఉంటే వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే బాధ్యతలు అప్పగించిన సెలక్టర్లు బ్యాకప్‌గా రిషబ్ పంత్‌ను కొనసాగించారు. నిజానికి పంత్ ఫామ్ దృష్ట్యా అతని ఎంపికపై సెలక్షన్ కమిటీ తర్జన భర్జన పడింది. ఒక దశలో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కుతుందని అనుకున్నా పంత్‌నే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. అలాగే వరుసగా విఫల మవుతున్న తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి మరో అవకాశమిచ్చారు.
ఈ సిరీస్‌లో కూడా ఫెయిలైతే మాత్రం వన్డే జట్టులో నితీ శ్ ప్లేస్ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరోవైపు హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సీఓఈ నుంచి క్లియరెన్స్ రాకపోవడం, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బూమ్రా లేకపోవడంతో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందని భావించారు. అయితే సెలక్టర్లు షమీని పట్టించుకోలేదు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నా షమీని పక్కన పెడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
కాగా పేస్ ఎటాక్‌లో చాలా రోజుల తర్వాత మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కింది. అలాగే అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష , హర్షిత్ రాణా ఎంపికయ్యారు. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కింది. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగుతాడు. జనవరి 11 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలువుతుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇరు జట్లు ఐదు టీ20సు కూడా ఆడనున్నాయి.టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే కివీస్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ , నితీశ్ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్
కివీస్‌తో వన్డే సిరీస్ షెడ్యూల్
జనవరి 11 : తొలి వన్డే వడోదర
జనవరి 14 : రెండో వన్డే రాజ్‌కోట్
జనవరి 18 : మూడో వన్డే ఇండోర్