calender_icon.png 5 January, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ అండర్ 19 జట్టు శుభారంభం

04-01-2026 12:00:00 AM

బెనోని, జనవరి 3 : ప్రపంచకప్‌కు ముం దు భారత్ అండర్ 19 జట్టు ఫామ్ అందుకుంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పరాజ యం పాలైన యువ జట్టు ఇప్పుడు సౌతాఫ్రికా టూర్‌లో శుభారంభం చేసింది. దక్షిణా ఫ్రికా అండర్ 19 జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో 25 పరుగుల తేడాతో విజ యం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయీస్ విధానంలో భారత్ గెలిచింది.

మొదట బ్యాటింగ్‌కు దిగి న భారత్ అండర్ 19 జట్టు 50 ఓవర్లలో 300 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్(5), వైభవ్ సూర్యవంశీ (11) , వేదాంత్ త్రివేది (21), అభిగ్యాన్ కుం దు(21)త్వరగానే ఔటవడంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హర్వన్ష్ పంగాలియా(93), అంబరీష్(65) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 140 పరుగులు జోడించారు.

హర్వన్ష్ 7 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. చివర్లో కనిష్క చౌహాన్ 32 పరుగులతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా అండర్ 19 జట్టును భారత బౌలర్లు దెబ్బకొట్టారు.

62 పరుగులకే 3 వికెట్లు పడగొట్టారు. అయితే వాన్ స్యాక్విక్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. అతనితో పా టు మనాక్(46) పర్వాలేదనిపించాడు. అ యితే సౌతాఫ్రికా స్కోర్ 148/4 స్కోర్ దగ్గర వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తర్వాత వర్షం కూడా రావడంతో అంపైర్లు డక్‌వర్త్‌లూయీస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు.  మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే సోమవారం జరుగు తుంది.